‘28న జాతీయ మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి’

‘28న జాతీయ మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి’

BHPL: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ కక్షిదారులకు సువర్ణావకాశమని ఎస్సై సతీశ్ తెలిపారు. తక్కువ సమయంలో, ఎటువంటి ఖర్చు లేకుండా చిన్నపాటి క్రిమినల్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. లోక్ అదాలత్ తీర్పే తుది నిర్ణయం కావడంతో వివాదాలకు శాశ్వత పరిష్కారం అని తెలిపారు.