VIDEO: బందనపల్లిలో శివాజీ విగ్రహానికి నిప్పు
WGL: రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విగ్రహాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్న సమయంలో దాతగా అందించగా, ప్రతిష్ట పనులు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షతోనే ఈ దాడి జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.