29 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం

KKD: జగ్గంపేట మండలం రామవరం శివారులోని ఓ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఒక లారీ, రెండు వ్యాన్లలో తరలిస్తున్న సుమారు 29 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్‌ఓ రుద్రరాజు సమక్షంలో జరిగిన ఈ ఆకస్మిక తనిఖీల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.