‘ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'
VZM: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ జనార్ధనరావు కోరారు. నెల్లిమర్ల నగరపంచాయతీలో గురువారం చేపడుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతతోనే రోగాలకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు.