1.26 లక్షల ఆటోలకు ఎలక్ట్రిక్‌ కిట్లు!

1.26 లక్షల ఆటోలకు ఎలక్ట్రిక్‌ కిట్లు!

TG: HYDలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 1.26 లక్షల ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చడంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆటో యజమానులకు రెట్రోఫిట్‌మెంట్‌ ఎలక్ట్రిక్ కిట్లు100 శాతం సబ్సిడీతో అందించనుంది. కాగా, ఒక్కో ఆటోకు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది.