జన్నారం రూరల్ నూతన ఎస్సైగా ఉదయ్ కిరణ్
MNCL: జన్నారం రూరల్ నూతన ఎస్సైగా ఉదయ్ కిరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. రామగుండం కమిషనరేట్‌లో వీఆర్‌లో ఉన్న ఉదయ్ కిరణ్‌ను జన్నారం నూతన ఎస్సైగా నియమిస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉదయ్ కిరణ్ ఒకటి, రెండు రోజుల్లో జన్నారం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టనున్నారు.