టీటీడీకి 105 వినికిడి యంత్రాలు విరాళం
TPT: తిరుపతికి చెందిన ఎన్. విరాట్, సోమవారం రూ. 20 లక్షల విలువైన 105 వినికిడి యంత్రాలను టీటీడీకి బహుకరించారు. ఈ యంత్రాలను టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు అందజేశారు. శ్రవణం ప్రాజెక్టులో శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళ్లే పిల్లలకు ఈ వినికిడి యంత్రాలను అందజేస్తారు.