తుమ్మలచెరువులో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
ప్రకాశం: విద్యా వారోత్సవాల సందర్భంగా "బడిపిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా సోమవారం తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. తుమ్మలచెరువు జనరల్ పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.