దేశంలోనే అత్యంత వృద్ధ ఎమ్మెల్యే కన్నుమూత
దేశంలోనే అతి వృద్ధ ఎమ్మెల్యేగా పేరొందిన శామనూరు శివశంకరప్ప(95) కన్నుమూశారు. కాంగ్రెస్‌కు చెందిన ఆయన కర్ణాటకలోని దావణగెరె సౌత్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. దావణగెరెలోని శామనూరులో 1931 జూన్ 16న జన్మించిన శంకరప్ప.. 1969లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు.