గౌడ్స్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ డివిజన్ గౌడ్స్ కాలనీలో మంగళవారం రాత్రి బతుకమ్మ వేడుకలను కాలనీ మహిళలు ఘనంగా నిర్వహించారు. చూడచక్కగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా మా కాలనీలో ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.