VIDEO: రాజమండ్రిలో తగ్గుముఖం పట్టిన చికెన్ ధరలు
E.G: రాజమండ్రి మాంసం మార్కెట్లు ఆదివారం సెలవు దినం కావడంతో వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. గతవారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా తగ్గడంతో విక్రయాలు పుంజుకున్నాయి. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ. 220-240, స్కిన్‌తో రూ. 210-220 మధ్య విక్రయిస్తున్నారు. లైవ్ కోడి ధర రూ. 150గా ఉంది. ఇక మటన్ ధర కిలో రూ.1000 వద్ద స్థిరంగా కొనసాగుతోందని వ్యాపారస్తులు తెలిపారు.