VIDEO: తూర్పు తండాలో MNREGS రికార్డుల పరిశీలన

VIDEO: తూర్పు తండాలో MNREGS రికార్డుల పరిశీలన

WGL: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న పనులపై సెంట్రల్ ఆడిట్ టీం శుక్రవారం పర్వతగిరి మండలంలో పర్యటించింది. తూర్పు తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు, అమలు విధానాన్ని తనిఖీ చేసింది. పరిశీలనలో టీం లీడర్ అమిత్ శ్రీవాత్సవ్‌, సభ్యులు పరాస్ శర్మ, మోహిత్ కుమార్ పాల్గొన్నారు. మండల అధికారులు, సర్పంచ్ దశరథ్ నాయక్ తదితరులు హాజరయ్యారు.