ప్రపంచ దేశాల మద్దతు కోసం ప్రయత్నం
ఇరాన్‌పై దాడుల కోసం UAE రహస్యంగా ప్రపంచ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అక్కడి నేతలు ఇరాన్‌పై చర్యలకు అధికారం ఇచ్చే ఐరాస భద్రతా మండలి తీర్మానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బలప్రయోగం చేసైనా.. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఒక కూటమిని ఏర్పాటు చేయాలని UAE దౌత్యవేత్తలు అమెరికా సహా యూరప్, ఆసియాలోని కీలక దేశాలను కోరుతున్నారు.