'మధ్యలో ఆగిన గృహాలను త్వరగా పూర్తిచేయండి'

'మధ్యలో ఆగిన గృహాలను త్వరగా పూర్తిచేయండి'

అన్నమయ్య: చిట్వేలులోని గట్టుమీదపల్లి లేఔట్లను మండల ప్రత్యేక అధికారి శివ నారాయణ గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. లబ్దిదారులు త్వరితగతిన గృహాలు పూర్తి చేయాలని కోరారు. సగంలో ఆగిన ఇళ్లను పూర్తి చేయడానికి ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సుధాకర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ నవ్య పాల్గొన్నారు.