నేడు జిల్లాలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పర్యటన

నేడు జిల్లాలో  రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పర్యటన

NRPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గురువారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు అప్పక్ పల్లి గ్రామంలో నిర్మాణం అవుతున్న జనరల్ మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఉదయం 11 గంటలకు సింగారం ఎక్స్‌రోడ్‌లో జిల్లా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును సందర్శిస్తారు.