హార్టికల్చర్ అసిస్టెంట్‌కు మెమో జారీ

హార్టికల్చర్ అసిస్టెంట్‌కు మెమో జారీ

KDP: ముద్దనూరు మండలంలోని కొత్తపల్లి సచివాలయానికి చెందిన హార్టికల్చర్ అసిస్టెంట్ పవన్ కుమార్‌కు మెమో జారీ చేసినట్లు ఎంపీడీవో ముకుందా రెడ్డి తెలిపారు. సచివాలయం విధులకు నాలుగు రోజులుగా అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైనట్లు వెల్లడించారు. సచివాలయాలను తనిఖీ చేసిన సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.