యువకుడిపై కత్తితో దాడి

యువకుడిపై కత్తితో దాడి

గుంటూరు: తుళ్ళూరులో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గం లోని వ్యక్తి పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో కంభంపాటి సురేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ వర్గానికి చెందిన యువతిని గుర్తు తెలియని వ్యక్తి ఏడిపించాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనం పై ఇద్దరు వ్యక్తులు రావడంతో.. వారే అని అనుమానంతో అమ్మాయి బంధువులు కత్తితో పొడిచారు.