అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

MHBD: రాష్ట్ర వాతావరణ సూచనల ప్రకారం జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. స్థానిక తహసీల్దార్లు, అన్ని విభాగాలు పోలీస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ మెడికల్ తదితర డిపార్ట్‌మెంట్లు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.