పట్టణంలో క్షుద్రపూజలు కలకలం

KRNL: కర్నూలు పట్టణంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన పట్టణంలోని కర్నూలు-బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో జరిగింది. గుప్తనిధుల అన్వేషణ, ఇచ్చిన అప్పు ఎగవేత నేపథ్యంలో ఈ క్షుద్రపూజలు జరిగినట్లు సమాచారం. కాగా, దీనికి సంబంధించిన ఫోటోలు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.