VIDEO: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

NRML: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన కుబీర్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. రంగశివుని తండాకు చెందిన సచిన్ అనే వ్యక్తి కుబీర్ - పార్డి(బి) రోడ్డుపై ద్విచక్ర వాహనంపై నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో సచిన్ తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.