షాద్ నగర్‌లో పట్టపగలే చోరీ

VKB: పట్టపగలే దొంగల హల్చల్ చేసిన ఘటన షాద్ నగర్ సమీపంలో చటాన్ పల్లిలో చోటుచేసుకుంది. రాంనగర్ కాలనీలో నివాసముండే అశోక్ అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలే ఓ యువకుడు దొంగతనానికి పాల్పడి..ఇంట్లో ఉన్న రూ. 20వేల నగదును దోచుకెళ్లాడు. నగదు చోరీ జరిగిన విషయాన్ని గమనించి యజమాని అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.