'రాళ్లపాడు ఆయకట్టుదారులకు నీరు విడుదల చేస్తాం'
NLR: రాళ్లపాడు ప్రాజెక్ట్ ఆయకట్టుదారులకు ఇవాళ నుంచి సాగునీరు అందిస్తామని DEE. వెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల సమావేశమైన ఆయకట్టు కమిటీ 9వ తేదీ నుంచి సాగునీరు అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు MLA ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా సాగునీరు విడుదల చేయడం జరుగుతుందన్నారు.