ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత

ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత

AP: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న మినుములూరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 10, అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల రాత్రిపూట, తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు.