ఓటు హక్కును వినియోగించుకున్న రిటర్నింగ్ అధికారి

కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలో రిటర్నింగ్ ఎన్నికల అధికారి రమేష్ రాథోడ్ తమ కార్యాలయంలో ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.