ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలి : సీజేఐ
భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని CJI జస్టిస్ గవాయ్ అన్నారు. ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ చట్టం చేసిందన్నారు. అలాగే SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. SC, ST రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు.