దివంగత మాజీ సీఎంకి ఘన నివాళులర్పించిన ZPTC

VZM: గజపతినగరం మండలంలో ZPTC గార తౌడు ఆధ్వర్యంలో మంగళవారం దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి పక్కన ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు గుర్తు చేసుకుంటూ ఆయనను కొనియాడారు.