పుత్తూరులో కుక్కల పట్టివేత

TPT: పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల సంచారం పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు కార్వేటినగరం రోడ్డు, కాలనీల్లో కుక్కలు విరివిగా తిరగడం వల్ల కాలనీవాసులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. పశుసంవర్ధక శాఖ సహకారంతో హస్బెండరీ వాహనం ద్వారా వీధి కుక్కలను పట్టుకుంటున్నారు.