అత్తపై అల్లుడి దాడి.. కేసు నమోదు
WGL: సంగెం మండలం గవిచర్లలో అత్తపై దాడి చేసిన అల్లుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జఫర్‌గఢ్ మండలం తీగారం గ్రామానికి చెందిన నాగరాజు తన అత్త రాంనర్సమ్మపై దాడి చేసి గాయపరిచాడు. కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.