వరి ధాన్యాన్ని ఢీకొట్టి.. వ్యక్తి మృతి
SRPT: చివ్వేంల మండలం బండమీ చందుపట్ల గ్రామం శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోట వెంకన్న(50) అనే వ్యక్తి నిన్న రాత్రి వేగంగా బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపై ఉన్న వరి ధాన్యాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయాపడ్డాడు. స్థానికులు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.