VIDEO: బొలెరో నడిపి రైతులకు మద్దతు తెలిపిన షర్మిల

VIDEO: బొలెరో నడిపి రైతులకు మద్దతు తెలిపిన షర్మిల

కడప: APCC చీఫ్ వైఎస్.షర్మిలా రెడ్డి కడపలో పర్యటించారు. ఈ క్రమంలో అరటి రైతుల పక్షాన కడపలో ఆమె వినూత్న ప్రదర్శన చేపట్టారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అరటి గెలలు లోడ్ చేసిన వాహనాన్ని స్వయంగా నడుపుకుంటూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు గెలలతో జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.