ఎమ్మీ అవార్డ్స్.. ఇండియన్ మూవీకి నిరాశ
న్యూయార్క్ వేదికగా జరిగిన 53వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో ఇండియన్ మూవీ 'అమర్‌సింగ్ చంకీల'కు నిరాశ ఎదురైంది. ఉత్తమ మినీ సిరీస్, ఉత్తమ నటుడు విభాగాల్లో పోటీలో నిలబడిన ఈ మూవీ ఎందులోనూ అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో దిల్జీత్ దొసాంజ్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.