ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన GHMC కమిషనర్
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు, GHMC కమిషనర్ వెంకన్న పరిశీలించారు. ఓటింగ్ శాతాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరైన సమయంలో ఓట్ల కౌటింగ్ ప్రక్రియ జరపాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు.