MSME పార్క్‌కు శంకుస్థాపన

MSME పార్క్‌కు శంకుస్థాపన

నెల్లూరు: రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత్ సింధూర్ MSME పార్క్‌కు శనివారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఈ పార్కు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఇక్కడ పరిశ్రమలు రావడం వలన వందలాది మంది యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు.