బొబ్బిలిలో కూలిపోయిన బాల బడి
VZM: బొబ్బిలి తారకరామ కాలనీ చిన్న అంబేద్కర్ లైన్‌లో పాడుబడిన బాల బడి అనే పేరుతో ఉన్న స్కూలు శుక్రవారం కుప్పకూలిపోయింది. ప్రస్తుతానికి పాడుబడిన స్కూల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఒక్కసారిగా స్కూలు పడిపోవడంతో ఆ కాలనీవాసులంతా భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని కాలనీవాసులు కోరుతున్నారు.