ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. మంత్రి హెచ్చరిక

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ శనివారం ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.