ట్రంప్ బెదిరింపు యుద్ధ నేరమే: ఇరాన్

ట్రంప్ బెదిరింపు యుద్ధ నేరమే: ఇరాన్

తమ దేశానికి నరకం చూపిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. మౌలిక సదుపాయాలను పేల్చివేస్తానంటూ ట్రంప్ చేసిన బెదిరింపు ఇరాన్ పౌరులను భయపెట్టడం కిందకే వస్తుందని తెలిపింది. ఇది యుద్ధనేరమని పేర్కొంది. ఐక్యరాజ్యసమితికి అంతరాత్మ ఉంటే ట్రంప్ యుద్ధోన్మాదంపై మౌనంగా ఉండదని అసహనం వ్యక్తం చేసింది. ఈ యుద్ధ నేరాలను అంతర్జాతీయ సమాజం నిరోధించాలని కోరింది.