'యూరియా కొరత లేదు.. యాప్ ద్వారా బుక్ చేసుకోండి'
సూర్యాపేట జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఫెర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే పారదర్శకంగా యూరియా బుక్ చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ ఫోన్ లేని వారు వాలంటీర్ల సాయం తీసుకోవాలన్నారు. అనవసరంగా నిల్వ చేయవద్దని, అవసరమైనప్పుడే కొనుగోలు చేసి సహకరించాలని ఆయన కోరారు.