VIDEO: వల్లాపురంలో కోతుల బెడదకు వినూత్న ఆలోచన
SRPT: కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు నడిగూడెం మండల పరిధిలోని వల్లాపురం గ్రామస్థులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. గ్రామ పొలిమేర వద్ద ఒక కుర్చీ ఏర్పాటు చేసి, దానిపై పులిబొమ్మను ఉంచి కోతులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొత్త ఆలోచనతో కోతుల సంఖ్య తగ్గి, పంటలకు నష్టం తగ్గుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.