నేడు జిల్లాకు వర్ష సూచన
నెల్లూరు: జిల్లాలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.