పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద
PLD: శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లను ఎత్తివేయడంతో పులిచింతల ప్రాజెక్టుకు వరుసగా 3వ రోజు మంగళవారం కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగాౌ.. దిగువకు 5.985 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఈఈ గుణకరరావు తెలిపారు. ప్రాజెక్టులో 38.38 మీటర్ల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.