VIDEO: భద్రకాళి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు

VIDEO: భద్రకాళి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు

వరంగల్ పట్టణ కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి.. హారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం మొత్తం అమ్మవారి నామస్మరణలతో మార్మోగింది.