'రోడ్డు భద్రత నియమాలు పాటించడం సామాజిక బాధ్యత'

'రోడ్డు భద్రత నియమాలు పాటించడం సామాజిక బాధ్యత'

KNR: రోడ్డు భద్రతా నియమాలు పాటించడం సామాజిక బాధ్యతని రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన 'అరైవ్-అలైవ్' సదస్సులో ఆమె మాట్లాడుతూ.. హెల్మెట్, సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించి, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.