VIDEO: తారాబు జలపాతం అందాలు అదరహో

VSP: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దుల్లో ఉన్న తారాబు జలపాతం పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 500 అడుగుల పైనుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని పర్యాటకులు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జలపాతంగా తారాబు జలపాతం గుర్తింపు పొందింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది.