హుజురాబాద్ లో లాయర్ల నిరసన ర్యాలీ
KNR: హుజురాబాద్ పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు గురువారం స్థానిక కోర్టు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు హుజురాబాద్ శివారులో ఏర్పాటు కానున్న డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. డంప్ యార్డ్ రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు.