ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ని కలిసిన నిర్వాసితుల బృందం
విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన ఆర్గానిక్ మేళాలో ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరంజీవిని పోలవరం ప్రాజెక్ట్‌తో సర్వం కోల్పోయిన నిర్వాసితుల బృందం కలిసింది. ఈ సందర్భంగా నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని ఆయనను కోరారు. సుమారు 5వేల జనాభా గోకవరం, దేవీపట్నం మండలాలకు వచ్చేసామని, గత 5 ఏళ్లుగా ఉపాధి అవకాశలు లేక ఇబ్బంది పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.