జిల్లాలో 16 రూర్బన్ పంచాయతీలు: డీపీవో
అల్లూరి జిల్లాలో 16 పంచాయతీలను ప్రభుత్వం రూర్బన్ పంచాయతీలుగా గుర్తించినట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. 10 వేలకుపైగా జనాభా, రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను ఎంపిక చేసినట్లు చెప్పారు. చింతపల్లి మండలంలో 4, అరకువాలీ, జి.మాడుగుల, జీకేవీధిలో 3JI చొప్పున, పాడేరు, పెదబయలు, డుంబ్రిగూడలో ఒక్కో పంచాయతీ ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు.