ఇవాళ వైకుంఠ ద్వారదర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. తొలి 3 రోజులకు ఇప్పటికే ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయించగా.. JAN 2-8 తేదీల దర్శనాలకు ఉ.10 గంటలకు రోజుకు వేయి చొప్పున శ్రీవాణి టికెట్లు రిలీజ్ అవుతాయి. మ.3కు రోజుకు 15 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.