'వికలాంగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి'

MDK: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6000 పెన్షన్ మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ నర్సాపూర్ మండల అధ్యక్షులు జమున గల్ల కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వికలాంగుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు.