నెలబల్లి దర్గాలో భక్తుల తాకిడి

TPT: దొరవారిసత్రం మండలం నెలబల్లిలో వెలసిన శ్రీహుస్సేనమ్మ దర్గాలో మూడు రోజుల పాటు జరిగే గంధోత్సవాలకు భక్తుల తాకిడి పెరిగింది. కుల మతాలకు అతీతంగా ప్రతి ఏటా జరిగే గంధోత్సవానికి బయట ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముస్లింలు దర్గాలో ఫాతేహాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.