మెడికల్ షాపులను తనిఖీ చేసిన తహసీల్దార్

NTR: పెనుగంచిప్రోలులో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కో-ఆపరేటర్ సొసైటీ, ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ బంకు, మెడికల్ షాపులను తహసీల్దార్ శాంతిప్రియ సోమవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు నష్టం కలుగకుండా క్వాలిటీ మెయింటైన్ చేయాలనీ ఆదేశించారు. లేని యెడల చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.